మంచేరియల్, 01-08-2026
తెలంగాణ ప్రభుత్వం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అవకాశం కల్పించారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉద్యోగాల ప్రకటన రావడంతో మంచిర్యాల జిల్లా యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం, సాయంత్రం వందల మంది యువకులు రన్నింగ్, కసరత్తులు మరియు వ్యాయామాలు చేస్తున్నారు. "ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సాధించాలని" కలలు కంటున్న అభ్యర్థులు నోటిఫికేషన్ రాగానే మరింత కష్టపడుతున్నారు. ట్రైనర్ల పర్యవేక్షణలో ఫిజికల్ టెస్టులకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
అర్హులైన అభ్యర్థులు tspolice.gov.in వెబ్సైట్లో తేదీలను గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.











