మంచిర్యాలలో 32వ డివిజన్ లో లబ్ధి దారులైన కటకం రజిత సత్యనారాయణ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్లుపథకం కింద, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొని, లబ్ధి దారుల గృహాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్ గారు మాట్లాడుతూ, 'ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంత త్వరగా చేకూరుతాయో ఈ ఇందిరమ్మ గృహాలు నిదర్శనము' అని అన్నారు.
మేయర్ మాట్లాడుతూ, 'ప్రేమ్ సాగర్ రావు గారి అండదండలతో మరింత అభివృద్ధి కోసం ముందుకు వెళ్లాలని' తెలిపారు.
ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












