మంచేరియల్, 2026-08-01
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఇతర ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్ ఫ్లో-అవుట్ లో పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.