మంచేరియల్, 2026-08-01
మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీమతి లెక్కల శ్రీదేవి గారికి, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందిన శ్రీమతి లెక్కల శ్రీదేవి గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో శ్రీదేవి మేడమ్ చేసిన సేవలను కొనియాడారు. ఆమె భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి శ్రీ బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, కోశాధికారి శ్రీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, శివ ప్రసాద్, నరేందర్, శ్రీమతి కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు శ్రీమతి సునీత, శ్రీమతి పద్మ లత, శ్రీ ప్రభు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు శ్రీ నాగుల గోపాల్, కార్యదర్శి శ్రీ అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు శ్రీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.











