Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 23
జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డ్రగ్ అబ్యూస్ – మాదకద్రవ్యాల దుర్వినియోగం"పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డి. రాజలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు వివరించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి. రాజలక్ష్మి సూచించారు. గురువారం జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "డ్రగ్ అబ్యూస్ – మాదకద్రవ్యాల దుర్వినియోగం" అంశంపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్‌కు బానిసైతే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు కె. చంద్రశేఖర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, ఏఎన్ఎంలు (ANMs), స్టూడెంట్ కౌన్సిలర్ హరి ప్రసాద్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.












