Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 23
జైపూర్ మండలం ఇందారం గ్రామం, దొరగారిపల్లె 4, 5, 6 వార్డుల్లో వర్షాల నేపథ్యంలో మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి. JCBతో చెత్త, ముళ్ల పొదలు తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జైపూర్ మండలం ఇందారం గ్రామం, దొరగారిపల్లె 4, 5, 6 వార్డుల్లో మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. JCB వాహనంతో నాళాల్లో పేరుకుపోయిన చెత్త, ముళ్ల పొదలను తొలగించి, మురికి నీరు సాఫీగా వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ శ్రీ ఎల్కటూరి శివ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వార్డు సభ్యులు చేగొండ మౌనిక-శ్రీనివాస్, బేధ లాస్య-ప్రసాద్, మాడుగుల శంకర్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్, జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ M.D. జైనొద్దీన్, యువనాయకులు చిప్పకుర్తి సతీష్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాకాలంలో నీరు నిలవకుండా చూడడం ద్వారా దోమలు, ఇతర వ్యాధులు రాకుండా నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.












