మంచేరియల్, జూలై 22
పరీక్షనీట్పపర్లీకజీ,పరీక్షలనిర్వహణలోఅవకతవకలు,ప్రతిపక్షఎంపీలఅరెస్టులనునిరసిస్తూరమకృష్ణపూర్లోకంగ్రెస్పర్టీఆధ్వర్యంలోనల్లబ్యడ్జీలుధరించినిరసనకర్యక్రమంజరిగింది.కంద్రప్రభుత్వంవిద్యర్థులజీవితలతోఆడుకుంటోందని,పరీక్షలనిర్వహణలోవిఫలమైందనికంగ్రెస్నయకులువిమర్శించరు.
నీట్ పేపర్ లీకేజ్, ప్రతిపక్ష ఎంపీల అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, అలాగే పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ కోరిన ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ రామకృష్ణాపూర్ (క్యాతనపల్లి మున్సిపాలిటీ) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల నుండి 2026 వరకు అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని, బేటి బచావో- బేటీ పడావో, విద్యా ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని నినాదాలతో దేశ ప్రజల విశ్వాసాన్ని పొందిందని, కానీ నేడు పరీక్షల విశ్వసనీయతను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని అన్నారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు విద్యార్థుల తరఫున నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చర్చ జరపాలని మాత్రమే డిమాండ్ చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ధోరణితో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని, పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకేజీలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
NEET సహా అన్ని పరీక్షలలో జరిగిన అవకతవకలపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు జరపాలని తెల్పారు. పరీక్షా వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టి విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలన్నారు. పార్లమెంట్లో NEET అంశంపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించాలి.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్, పట్టణ మాజీ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ జడ్పిటిసి యాకుబ్ అలీ, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, అధికార ప్రతినిధి మొట్టె సుధాకర్, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, పట్టణ ఉపాధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గోపు రాజం, మేకల సురేందర్, ఏల్పుల సత్యనారాయణ, ఎర్రబెల్లి రాజేష్, కార్యదర్శులు పైడాకుల శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్, రాపాక రాజు, శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వనం యాదగిరి, పోగుల లచ్చులు, కనకయ్య, పందిరి లింగయ్య, మహిళా నాయకులు రాజేశ్వరి, పుష్ప, దీప, అనూష, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.












