పెద్దపల్లి, 2026-07-23
మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, వారి కోరిక మేరకు ముప్పిరితోట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణారావు గారు ప్రారంభించారు. గోదావరిఖని–ముప్పిరితోట–గర్రెపల్లి మార్గంలో బస్సు సేవలను ఆయన ప్రారంభించారు.
మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, వారి కోరిక మేరకు ముప్పిరితోట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చింతకుంట విజయరమణారావు గారు ప్రారంభించారు.
గోదావరిఖని–ముప్పిరితోట–గర్రెపల్లి మార్గంలో బస్సు సేవలను ప్రారంభిస్తూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు. రూ.12 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు త్వరలో పూర్తి కానున్నాయని, త్వరలో పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభం అవుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 3 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
మాటలకు కాదు.. చేతలకు నిలబడే నాయకత్వం, ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.












