మంచేరియల్, 2026-07-21
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, హైదరాబాద్, జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పథకం (NMMS) పరీక్ష - 2026-27కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్ష 01-11-2026న జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించబడుతుంది. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, రుసుము వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ (LB) మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ. పి. చంద్రయ్య తెలిపారు.
జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పథకం (NMMS) పరీక్ష - 2026-27కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, తెలంగాణ, హైదరాబాద్ వారు తెలిపారు. ఈ పరీక్షను 01-11-2026 (ఆదివారం) రోజున ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (LB) మరియు జిల్లా విద్యాశాఖ అధికారి మంచిర్యాల శ్రీ. పి. చంద్రయ్య గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ పరీక్షకు 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతి ఉత్తీర్ణులై, ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు వసతి సౌకర్యం లేని మోడల్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు 7వ తరగతిలో జనరల్/ బీసీ విద్యార్థులు కనీసం 55% మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3,50,000/- లకు మించకూడదు.
కేంద్ర విద్యాలయాలు, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు ప్రైవేట్ అస్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కారు.
ఆన్లైన్ దరఖాస్తులను https://bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేయవచ్చు.
పరీక్ష రుసుము: జనరల్ & బీసీ విద్యార్థులు: రూ.100/-, ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ విద్యార్థులు: రూ.50/-.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు నమోదు మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ 24-08-2026. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, నామినల్ రోల్స్ మరియు సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించడానికి చివరి తేదీ : 01-09-2026.
కావున, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు వసతి సౌకర్యం లేని మోడల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అర్హులైన విద్యార్థులను గుర్తించి, గడువులోగా ఆన్లైన్ దరఖాస్తులు నమోదు చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో పాటు నామినల్ రోలస్ను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించవలసిందిగా జిల్లా అదనపు కలెక్టర్(LB) మరియు జిల్లా విద్యాశాఖ అధికారి మంచిర్యాల శ్రీ. పి. చంద్రయ్య గారు కోరుతున్నారు.
ఇట్టి విషయములో పాఠశాలల ప్రధానోపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కువ మంది పిల్లలు పరీక్షకు అప్లై చేసుకునే విదంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్(LB) మరియు జిల్లా విద్యాశాఖ అధికారి మంచిర్యాల శ్రీ. పి. చంద్రయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు.












