ఆడపిల్లలను భారంగా భావించకుండా, వారికి నాణ్యమైన విద్య అందించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పల్లవి అన్నారు. కూతుర్లు టెన్షన్ కాదని, పది మంది కుమారులతో సమానమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తన ఇద్దరు కుమార్తెలు అనూహ్య, అక్షయల ప్రగతిని వివరించారు. పెద్ద కుమార్తె అనూహ్య ఎన్ఐటీ వరంగల్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. చిన్న కుమార్తె అక్షయ ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ సాధించి, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఆడపిల్లలకు విద్య, ఆత్మవిశ్వాసం, అవకాశాలు కల్పిస్తే వారు కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారని శ్రీహరి పల్లవి దంపతులు తెలిపారు. తమ ఇద్దరు కుమార్తెలతో కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.












