జిల్లా మరియు సెషన్స్ కోర్టులో ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (), కోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ () వినియోగంపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఏ.వీరయ్య, పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ శ్రీ ఏ.భాస్కర్ హాజరయ్యారు.
ఈ-ఎఫ్ఐఆర్, ఈ-చార్జిషీట్, ఈ-సమ్మన్స్, సీసీటీఎన్ఎస్ లలో సమాచార నవీకరణ, కేసుల పురోగతి, చార్జిషీట్ల దాఖలు, పోలీస్ శాఖన్యాయస్థానాల మధ్య సమన్వయం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని సీపీ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సమస్యలను చర్చించడమే కాకుండా, వాటికి శాశ్వత పరిష్కారం లభించేలా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. చార్జిషీట్ల దాఖలు చివరి దశలో ఒత్తిడి పెరగకుండా, కేసుల పురోగతిని ముందుగానే సమీక్షిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను వారానికి ఒకసారి సమీక్షించి, ప్రతి కేసులో అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
స్థానిక స్థాయిలో పరిష్కారం కాని వ్యవస్థాగత సమస్యలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైన సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేలా పోలీస్, న్యాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, లైజన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ఐటీ విభాగం తదితరులు ఒకే బృందంగా సమన్వయంతో పనిచేస్తే కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు, న్యాయ ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగుతుందని సీపీ పేర్కొన్నారు. జిల్లాలో నేర న్యాయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీ ఆర్.ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ శ్రీ వి.కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ శ్రీ ఏ. వెంకటేశ్వర్లు, సహాయ సెషన్స్ న్యాయమూర్తులు శ్రీమతి ఏ.నిర్మల, శ్రీ డి.రామ్మోహన్ రెడ్డి, ప్రథమ శ్రేణి న్యాయమూర్తులు శ్రీమతి కె.నిరోషా, శ్రీ వి.కృష్ణతేజ, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలు, లైజన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ఐటీ కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.






