మంచేరియల్, 27 September
తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 111వ జయంతిని పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని బాపూజీ గారికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను స్మరించుకున్నారు.
తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 111వ జయంతిని పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో శ్రీ క్రాంతి కిరణ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ మోతిరామ్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ దుర్గాప్రసాద్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గార్లు పాల్గొని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఆయన చేసిన సేవలు మరవకూడదని, అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి తొలిదశ, మలిదశ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. లో బైపాస్ చౌరస్తాలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు శ్రీమతి కేజీయా రాణి, శ్రీ సత్యనారాయణ, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు శ్రీ వెంకటేష్ గార్లు తదితరులు పాల్గొన్నారు.


