మంచేరియల్, July 2, 2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజ్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. గురువారం జిల్లాలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి, వేమనపల్లి, నీల్వాయి గ్రామాలలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజ్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి, వేమనపల్లి, నీల్వాయి గ్రామాలలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగిన వారి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తూ ప్రస్తుత సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మరణించిన, గ్రామం వదిలి వెళ్ళిన ఓటర్ల తొలగింపు, 2 కంటే ఎక్కువ ఎపిక్ కార్డులు కలిగిన వారు ఒకే కార్డు ఉండేలా చూడాలని సూచించారు. ఆన్లైన్ లో సైతం ఎన్యుమరేషన్ ఫారం నింపవచ్చని తెలిపారు.
ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారం నింపేందుకు బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత, చదువుకున్న వారు సహాయం అందించాలని, ఒకరు ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే కలిగి ఉండేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత సేకరించి బి ఎల్ ఓ యాప్ లో డిజిటలైజ్ చేయాలని సూచించారు.
అనంతరం నీల్వాయి లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, కొనసాగుతున్న అదనపు తరగతి గదులు, వంటశాల పనులను పరిశీలించారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












