మంచేరియల్, 2026-07-02
SIR ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ప్రజలకు సూచించారు. మంచిర్యాల కార్పొరేషన్ 46 వ డివిజన్ 174 బూత్ లో ఆయన ప్రజలను కలిసి ఫారం నింపడంపై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరు తమ ఓటును SIR (Special Intensive Revision) లో నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ 46 వ డివిజన్ 174 బూత్ లో SIR ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ప్రజలను కలిసి, ఎన్యుమరేషన్ ఫారం నింపడంపై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, BLOలు తెచ్చి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారంను సరైన పద్ధతిలో నింపి ఇవ్వాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపడంలో సహాయం చేయడానికి ప్రతి బూత్ లో బీజేపీ పార్టీ నుండి BLA2 లను నియమించడం జరిగిందని, ఓటర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారి BLA 2 లను సంప్రదించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ ఓట్లు తొలగిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే SIR ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు తొలగించబడదని ఆయన స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన ప్రతి ఒక్క ఓటరుకు ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీరిశెట్టి రాజ్ కుమార్, ముచ్చకుర్తి కిషోర్, అవిడపు రాజబాబు, బింగి ప్రవీణ్, నల్ల రవి, అంకం మనోజ్, బండి శంకర్, కునారపు రమేష్, కంచర్ల శ్రీకాంత్, కలవెని సంపత్, అశోక్, సాయి కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.










