మంచేరియల్, 2026-07-28
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన దుస్తులను సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కుట్టు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఏకరూప దుస్తులను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కుట్టు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి ఏకరూప దుస్తుల తయారీ పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి విద్యార్థి కొలతలను సరిగ్గా తీసుకుని, వారి కొలతలకు అనుగుణంగా దుస్తులు కుట్టాలని, పనులలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, ఉపాధి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయని, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సుభాష్, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.












