మంచిర్యాల జిల్లా మండలం లింగాపూర్, దమ్మన్నపేట, తానిమడుగు గ్రామాల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లితో కలిసి గిరిజన ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లింగాపూర్ గ్రామంలో 22 నిషేధిత భూముల జాబితాలో తమ పేర్లు చేర్చడం, దమ్మన్నపేట గ్రామంలో పోడు భూముల సమస్య, అటవీ అధికారుల వేధింపులు, తానిమడుగు గ్రామంలో రోడ్ల సమస్యలపై గ్రామ ప్రజలు హుస్సేన్ నాయక్ దృష్టికి తెచ్చారు. గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.












