జిల్లాలో పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా, జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కోర్టును ఏర్పాటు చేయాలని వారు వినతి చేశారు.
జిల్లాలో పర్యటనల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ని బార్ అసోసియేషన్ కు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు విచ్చేసిన హుస్సేన్ నాయక్ కి బార్ అసోసియేషన్ తరపున సన్మానం చేయడం జరిగింది. అనంతరం, జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కోర్టును ఏర్పాటు చేయాలని, తద్వారా ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ కోర్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండటం వల్ల, ఇక్కడి నుంచి ఫిర్యాదుదారులు, బాధితులు ఆదిలాబాద్ కు వెళ్లి రావాలంటే అధిక ఖర్చు అవుతోందని వివరించారు.
జిల్లా కూడా విస్తారంగా ఉన్నందున, జిల్లా కేంద్రంలోనే ఎస్సీ, ఎస్టీ కోర్టును ఏర్పాటు చేస్తే ఇక్కడి వారికి ఎంతో న్యాయం జరుగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు పులి రాయమల్లు, సత్యనారాయణ, మల్లారెడ్డి, మల్లేష్, రవీందర్, కమల మనోహర్, తులా ఆంజనేయులు, మంజుల, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.












