మంచేరియల్, 2026-07-28
రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా 'ఫీజుల బకాయి- బీజేపీ లడాయి' పేరుతో ఆందోళనలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా “ఫీజుల బకాయి- బీజేపీ లడాయి” పేరుతో నిర్వహించనున్న ఆందోళనల కార్యమాల పోస్టర్ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు ఈరోజు జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకుండా తల్లిదండ్రులను, విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తోందని ఆయన అన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 40 వేల మంది విద్యార్థులకు 15 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను పెండింగ్లో ఉంచి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో, కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం వేరే కళాశాలలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము జెన్ జీలకు అండగా ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నారని, మరి ఇదే జెన్ జీల స్కాలర్షిప్ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజుల ముఖేష్ గౌడ్, కొయ్యల ఎమాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎతం శివ కృష్ణ, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, అందుగుల శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, బొలిశెట్టి అశ్విన్, వైద్య శ్రీధర్, కర్రె లచ్చన్న, సంజీవ్ రావు, మెట్టుపల్లి జయరామ రావు, తోట మల్లికార్జున్, కిషోర్ ముచ్చకుర్తి, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రవర్తి, కొంక సత్యనారాయణ, పచ్చ స్వప్న రాణి, మద్ది సుమన్, కొండ వెంకటేష్, దార రవి సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.












