మహిళలు, చిన్నారులు తమ సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులను సహించవద్దని, షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా తాండూర్ లోని కస్తూరిభాగాంధీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో షీ టీమ్ పోలీసులు పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమ మహిళా భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లా తాండూర్ లోని కస్తూరిభాగాంధీ గర్ల్స్ జూనియర్ కాలేజీలో నిర్వహించబడింది. షీ టీమ్ సిబ్బంది మహిళల కోసం అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్ మరియు షీ టీమ్స్ సేవల గురించి సమగ్రంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తూ, హెల్ప్‌లైన్ నంబర్లు డయల్ 112, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 లను తెలియజేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలత, ప్రిన్సిపాల్ కవిత మేడమ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.












