రామకృష్ణాపూర్లోని జిల్లా పరిషత్ బాలికల త పాఠశాలలో విద్యార్థినులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, కాక వెంకటస్వామి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
విద్యార్థినుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల వేణు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినులకు బ్యాగులు, నీటి బాటిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యలో రాణించి త లక్ష్యాలను సాధించాలని నాయకులు ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు కొంతమేరకు తోడ్పాటు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్, పార్వతి విజయ, దాముఖ రమేష్, పట్టణ కార్యదర్శి భైర మల్లేష్, నర్ర శ్రీనివాస్, కుదిరే రామస్వామి, సంఘ తిరుపతి, రవీందర్, రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు.












