ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 202728 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఎటువంటి రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 202728 విద్యా సంవత్సరానికి 9వ తరగతి, 11వ తరగతులలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్-2027కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అర్హత కలిగిన విద్యార్థులు ఎటువంటి రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 9వ తరగతి ప్రవేశాలకు ://../2026/9, 11వ తరగతి ప్రవేశాలకు ://../2026/11 వెబ్ సైట్ల ద్వారా ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.











