Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 28
సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కిరణ్ రాజ్ కుమార్ మంగళవారం ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించి, ఉద్యోగులు, కార్మికులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభావిత గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఓ) డా. కిరణ్ రాజ్ కుమార్ మంగళవారం ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిస్పెన్సరీలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు అందిస్తున్న వైద్య విధానాలు, సదుపాయాల గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఎస్టిపిపి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ప్రభావిత గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
డిస్పెన్సరీలోనే సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్ సహా అన్ని వైద్య పరీక్షలు నిర్ణీత సమయానికి నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, ఇతర ఏరియా హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పిస్తామని డా. కిరణ్ రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ డా. జానకి, సీనియర్ స్టాఫ్ నర్స్ రాజమణి, వార్డ్ అసిస్టెంట్లు రాజు, తిరుపతి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.












