జైపూర్, 27.07.2026
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలో 'జలసిరి కార్యక్రమం' కింద నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జ్ నిర్మాణాలు వంటి పనులకు ప్రదేశాలను గుర్తించి, అంచనాలు తయారు చేయాలని, అలాగే గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు.
జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ - జలసిరి / VB-GRAM-G కార్యక్రమం కింద వివిధ నీటి సంరక్షణ పనులకు ప్రదేశాల గుర్తింపు, అంచనాలు తయారీ మరియు గ్రామ సభలు నిర్వహణకు సంబంధించి ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
తేదీ: 27.07.2026 న MPP జైపూర్ నందు MPDO, MPO & APO ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు, జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో 'జలసిరి కార్యక్రమం' కింద చేపట్టాల్సిన పనులకు అవసరమైన ప్రదేశాలను వెంటనే గుర్తించి, వాటికి సంబంధించిన అంచనాలను తయారు చేయాలని సూచించారు. ఈ పనులలో వ్యవసాయ కుంటలు (Farm Ponds), సామూహిక ఇంకుడు గుంతలు (Community Soak Pits), వ్యక్తిగత ఇంకుడు గుంతలు (Individual Soak Pits), బోరు రీఛార్జ్ నిర్మాణాలు (Borewell Recharge Structures), పర్కోలేషన్ ట్యాంకులు (Percolation Tanks), వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు (Rain Water Harvesting Structures), మ్యాజిక్ డ్రెయిన్లు (Magic Drains) మరియు బహిరంగ బావులు (Open Wells) ఉన్నాయి.
అంతేకాకుండా, ఈ పనులపై ప్రజాభిప్రాయం సేకరించడానికి, ప్రదేశాలను ఖరారు చేయడానికి రాబోవు 2 రోజులలోపు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభను నిర్వహించాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు (PS) ఆదేశాలు జారీ అయ్యాయి. కావున, పంచాయతీ కార్యదర్శులు (PS), టెక్నికల్ అసిస్టెంట్లు (TA), ఫీల్డ్ అసిస్టెంట్లు (FA) అందరూ ఈ ఆదేశాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి, చేపట్టిన పనుల నివేదికను కార్యాలయానికి సమర్పించాలని కోరడమైనది.











