రాంనగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆగమన కార్యక్రమంలో మాజీ డిసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో దుర్గామాత భవాని దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆగమన కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ కూడా పాల్గొన్నారు.
సురేఖమ్మ ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులను, వారికి సహకరించిన మేయర్ ధర్ని మధుకర్ గారిని అభినందించారు.
అనంతరం సురేఖమ్మ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












