మంచేరియల్, 2026-07-23
మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా రామగిరి బానేశ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలకు బానేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా రామగిరి బానేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గార్లకు ఛైర్మన్ బానేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారి సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని వెల్లడించారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ, మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.












