హైదరాబాద్, 2024-08-13
రాష్ట్ర, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు నామినేటెడ్ పదవులకు బదులుగా మూడు వారాలలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది. ఈ ఆదేశాలు మత్స్యకారుల సంఘాల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి.
రాష్ట్ర, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు నామినేటెడ్ పదవులకు బదులుగా మూడు వారాలలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది.
ఈరోజు తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానంలో WP24522/2026 పిటిషన్పై విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర వివిధ జిల్లాల మత్స్య సంఘాల అధ్యక్షులు, చీఫ్ ప్రమోటర్లు అయిన ములుగు జిల్లాకు చెందిన సాదు రఘు, వనపర్తి జిల్లాకు చెందిన పుట్ట బాలరాజు, హనుమకొండ జిల్లాకు చెందిన బుస మల్లేశం, గౌరవ, డా. శ్రీ బండ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సమక్షంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం WP14273/2024 తీర్పు ప్రకారం, 706 మత్స్య సంఘాలలో 404 సంఘాలకు చేతులెత్తే పద్ధతిలో, 302 సంఘాలకు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హైకోర్టుకు షెడ్యూల్ ప్రకటించి హామీ ఇచ్చారు. చేతులెత్తే పద్ధతి సంఘాలకు 02.08.2025 నుండి 07.08.2025 వరకు, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి సంఘాలకు 18.08.2025 నుండి 07.09.2025 వరకు ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారు.
అయితే, షెడ్యూల్ ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాలయాపన చేయడంపై గౌరవ హైకోర్టు ధిక్కరణ కేసు CC2920/2025 ను ప్రభుత్వం ముఖ్య శాఖల చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ డిప్యూటీ రిజిస్టర్ పై గౌరవ హైకోర్టు జారీ చేసింది. ఇలాంటి తప్పులు మరోసారి పునరావృతం కాకుండా, నామినేటెడ్ పదవులకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామ, జిల్లా, మరియు రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సామాఖ్యకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్, మత్స్య సహకార సంఘాల జనరల్ మేనేజర్లకు గౌరవ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ చైర్మన్, జిల్లా చైర్మన్ మరియు గ్రామ అధ్యక్షుల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించవలసిందిగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
గౌరవ హైకోర్టులో మత్స్యకారుల తరఫున పోరాడి ఆర్డర్ ఇప్పించిన గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాది డి.యల్. పాండు గారికి రాష్ట్ర మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పిటిషనర్లు తెలిపారు.









