మంచేరియల్, 2026-07-30
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పంప్ హౌస్ పైపులైన్ దెబ్బతిని కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో, నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పైపులైన్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టాలని మేయర్ శ్రీ దర్ని మధుకర్ అధికారులను ఆదేశించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పంప్ హౌస్ పైపులైన్ దెబ్బతిని కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు.
గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పైపులైన్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందించారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ గారు, స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్ గార్లు, అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం గారు, DE రాజేందర్ గారు, సిబ్బంది పాల్గొన్నారు.












