మంచేరియల్, 2026-07-30
ప్రస్తుత వర్ష పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. గురువారం జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19, 7 వార్డులలో నెలకొన్న స్థితులను ఆయన జిల్లా కలెక్టర్, ఎ.సి.పి., మున్సిపల్ కమిషనర్ లతో కలిసి పరిశీలించారు.
ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19, 7 వార్డులలో నెలకొన్న స్థితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎ.సి.పి. కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్ష పరిస్థితులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవలను అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాలకు వరద కారణంగా రవాణా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితిని అధిగమించేందుకు రహదారి అనుసంధానం అంశంపై అటవీశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించడం జరిగిందని, 7వ వార్డులో కూలిన ఇంటి గోడ స్థితిని పరిశీలించడం జరిగిందని తెలిపారు. సంబంధిత ఇంటి యజమానులకు పరిహారం అందించి ఇంటిని నిర్మించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో కూలిన ఇంటి గోడకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాలలో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో అటవీశాఖ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించినట్లయితే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరెషన్ ఫారాలా డిజిటలైజేషన్ త్వరగా పూర్తిచేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంకా ఫారాలు అందించని వారిని గుర్తించి బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా సేకరించే విధంగా పర్యవేక్షించాలని తెలిపారు. సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ పన్ను బకాయిలను త్వరగా వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.









