Hyderabad/Agartala (ప్రజావార్త) జూలై 11
భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజలకు కీలక సూచనలు జారీ అయ్యాయి. ఓటర్ నమోదుకు ఈ నెల 224వ తేదీ ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజానీకానికి ఒక ముఖ్య ప్రకటన. ఈ ఓటర్ SIR నమోదు కార్యక్రమం తప్పనిసరి. ప్రజలందరూ దరఖాస్తు ఫారాలను నింపి బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) కి అందజేయాలి. దరఖాస్తు ఫారాలు నింపే క్రమంలో ఏవైనా సందేహాలుంటే BLO గారిని సంప్రదించవచ్చు.
ఈ నెల 24వ తేదీ ఆఖరి గడువు కావడంతో, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నాం. మంజునాథ హిల్స్ రోడ్ నంబర్ 12లోని అంగన్వాడి స్కూల్ నందు ఓటర్ ఫారాలు ఇవ్వబడతాయి. ఇంతకుముందు ఫారాలు తీసుకున్నవారు తప్పనిసరిగా పూర్తి చేసి తిరిగి ఇవ్వగలరు.
గమనిక: దరఖాస్తు ఫారాలు BLOకి తిరిగి అందజేయని యెడల ఓటు హక్కును కోల్పోతారని తెలియజేయడమైంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో, ఓటర్లను గుర్తించడం కొంత కష్టతరంగా మారింది. కావున ప్రతి ఓటరు BLO గారిని తప్పకుండా సంప్రదించగలరు.
BLOల మొబైల్ నంబర్లు: మామిడి విజయ 9381911163, సునీత చిప్పరి 9000960543. ఇట్లు, మీ 9వ వార్డు కౌన్సిలర్ శ్రీ భీమ మల్లేష్ గారు. ఫోన్ నంబర్లు: 9110574186, 9603308000.











