మంచేరియల్, 2026-07-11
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్-2 ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ సింగరేణి అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి, ప్రభావిత గ్రామాలు, భూములు కోల్పోతున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పలు విజ్ఞప్తులు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్-2 ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ సింగరేణి అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి, ఎన్ని గ్రామాలు ప్రభావితమయ్యాయి, ఎంత మంది భూములు కోల్పోతున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ, సింగరేణి బిజెపి భరోసా పేరుతో పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణి కార్మికులకు ఒక బహుమతి ఇవ్వాలని కోరారు. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైన్ కు విచ్చేస్తున్న కిషన్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.
పర్యావరణ అనుమతులను త్వరగా తీసుకువచ్చి, మైన్ను త్వరగా ప్రారంభించేలా చూడాలని సూచించారు. తాడిచెర్ల మైన్ పేరుతో రాజకీయాలు వద్దని, అతి త్వరగా అనుమతులు తీసుకువచ్చి మైన్ పనులు ప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
సింగరేణి బిజెపి భరోసా పేరుతో పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. మూడు నెలల్లో ఈ మైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తాడిచెర్ల మైన్ నుంచే సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచుతూ హామీ ఇవ్వాలని కోరారు.
ఈ మైన్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాజెక్టుతో 50వేల కోట్ల రూపాయల టర్నోవర్ పెరుగుతుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.










