మంచేరియల్, 2026-06-28
సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం కమిటీ ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను బొగ్గు రంగంలో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్వర్యంలో జులై 1న కొత్తగూడెంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని సి ఐటియుపిలుపు టి యు ఐనిచ్చింది.
వేతన 12వ ఒప్పందం కొరకు జేఏసీ ఆధ్వర్యంలో జులై 1న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని CITU పిలుపునిచ్చింది. ఈ మేరకు రామకృష్ణాపూర్ లోని యూనియన్ ఆఫీసులో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అల్లి.రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు.వెంకటస్వామి మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని కోలిండియా యాజమాన్యం కమిటీ ఏర్పాటును ఆలస్యం చేయడం సరికాదని అన్నారు. యాజమాన్యం మాట వినకపోవడంతో బొగ్గు రంగాల 4 ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు జులై 1న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
భారతదేశంలో ఏ రంగంలోనూ అమలు చేయకుండా, కేవలం బొగ్గు రంగంలోనే లేబర్ కోడ్లను అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని, ఇప్పటికైనా 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుకు సుముఖత తెలపాలని లేదంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
లేబర్ కోడ్లను బొగ్గు రంగంలో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న BMS, వేతన ఒప్పంద కమిటీని డిమాండ్ చేస్తూ నాలుగు ఫెడరేషన్ల యూనియన్లతో కలిసి రాకుండా ఒంటరిగా పోరాడటం సరైనది కాదని, అన్ని యూనియన్లతో కలిసి డిమాండ్ డే లో పాల్గొని ఐక్య పోరాటాలకు బలం చేకూర్చాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు జడల.ప్రవీణ్, నామాని.సురేష్, అసిస్టెంట్ సెక్రెటరీ ధనిశెట్టి.సురేష్, ఏరియా ఆర్గనైజర్ బాసబోయిన.కుమారస్వామి, పిట్ సెక్రటరీలు నాగవెల్లి.శ్రీధర్, పసునూటి.శ్రీకాంత్ లతో పాటు హరీష్, మహమ్మద్.తాజ్ లు పాల్గొన్నారు.












