మంచేరియల్, 2026-06-27
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాలలో SIR Enumeration Form పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మలకు ఫారాలను కార్పొరేటర్ జోగుల సదానందం అందజేశారు. ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలోని 21వ డివిజన్లో SIR Enumeration Form పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మలకు 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జోగుల సదానందం SIR Enumeration Form లను స్వయంగా అందజేశారు.
అలాగే, 21వ డివిజన్ 138వ బూత్‌కు సంబంధించిన BLO శ్రీమతి సుశీల కూడా జోగుల సదానందం నుంచి ఫారం అందుకున్నారు. SIR ప్రక్రియను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ SIR–2026 ప్రక్రియలో భాగస్వామ్యమై తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోపాలు లేని ఓటరు జాబితా తయారీకి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










