హైదరాబాద్, 8 September
బీఆర్ఎస్ పార్టీ పుట్టుకతోనే దళిత వ్యతిరేక పార్టీ అని, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని అవమానించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు అన్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ సమావేశంలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పుట్టుకనే దళిత వ్యతిరేక పార్టీ.. అసెంబ్లీ స్పీకర్ తల్లిని అవమానించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి... కెసిఆర్ సూచన మేరకే వీధి రౌడీల ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని సభ్య సమాజం తలదించుకునేలా అవమానపరిచిన ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి ల పై తగిన చర్యలు తీసుకోవాలి.. * రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు... హైదరాబాద్ లోని అసెంబ్లీ సమావేశంలో మంగళవారం జరిగిన చర్చలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు పథకం ప్రకారం బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ సూచన మేరకు నానా హంగామా, యాగి చేసి కేటీఆర్, హరీష్ రావు లతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల లాగా ప్రవర్తించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టుక తోనే దళిత వ్యతిరేకత ఉందన్నారు. ఎంతో సౌమ్యులు, హుందాగా ప్రవర్తించే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి తల్లి పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన తాత మధు, నవీన్ రెడ్డిల వ్యవహారంపై ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో క్షమాపణలు చెపుతారని భావించామని, కానీ వారిని హరీష్ రావు, కేటీఆర్ లు వెనుకేసుకోరావడం చూస్తే పార్టీ మద్దతుతోనే ఈ వాక్యాలు చేశారని అర్థమవుతుందన్నారు. దళితుల పట్ల వారి దురహంకార వైఖరిని మరోసారి చాటుకున్నారని విజయరమణ రావు గారు మండిపడ్డారు. ఆది నుండి కెసిఆర్ దళిత వ్యతిరేకిగా ముద్ర పడ్డారని చెప్పారు. వర్గీకరణ ఉద్యమం కోసం పాటుపడిన దళితనేత మందకృష్ణ మాదిగ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి జైలు పాలు చేశారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అకారణంగా తొలగించారని గుర్తు చేశారు. దళితులను సీఎం చేస్తానని, మాట నెరవేర్చకుంటే తల నరుక్కుంటానని చెప్పి మరీ మోసం చేశారని అన్నారు. ఒక్కో దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అన్యాయం చేశారని అన్నారు. ఓ సమావేశంలో నాటి దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను తన పక్కన కూర్చుంటే చేయి పట్టి అసహ్యించుకుంటూ కెసిఆర్ దూరంగా నెట్టివేసిన సంఘటన అప్పట్లో బడుగు, బలహీన వర్గాలను, దళితులను, ప్రజలందరినీ ఎంతో బాధించిందన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్మెంట్ అయిన తర్వాత వారిని ఏదో ఒక పదవిలో నియమించి గౌరవించారని, కానీ నాడు కెసిఆర్ ప్రభుత్వం అందరికీ అవకాశం ఇచ్చి దళితుడు అయినందునే సతీష్ చంద్ర అనే ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయితే ఏ పదవిలోనూ నియమించలేదని విజయరమణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, సంతోష్ రావ్ లు నేరెళ్లలో ఇసుక మాఫియాతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దిగమింగుతుంటే అడ్డుకున్న దళితులను తర్డ్ డిగ్రీతో హింసించిన చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో దళిత వ్యతిరేక వైఖరిని కేసీఆర్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు చాటుకున్నారని తెలిపారు. స్పీకర్ పట్ల తాత మధు, నవీన్ రెడ్డిల అనుచితంగా ప్రవర్తించిన సంఘటన అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే గా నిలిచిపోతుందని అన్నారు.












