మక్తల్, 6 September
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ () ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మక్తల్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగింపునకు నోటీసులు రావడంతో, అర్హులైన ఓటర్లు తమ హక్కును కోల్పోకుండా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.
ఓటు హక్కును కాపాడటం కార్యకర్తల బాధ్యత ముక్తల్ 06-9-26 *SIRపై BLAలు, సూపర్వైజర్లతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష* ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజనసేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), సూపర్వైజర్లతో మంత్రి ఆధ్వర్యంలో SIRపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... *మక్తల్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఆందోళన* ఇప్పటికే మక్తల్ నియోజకవర్గంలో 36 వేల ఓట్లు తొలగించబడ్డాయని, తాజాగా మరో 76 వేల ఓట్ల తొలగింపునకు నోటీసులు వచ్చాయని తెలిపారు. అర్హులైన ఓటర్ల హక్కు కోల్పోకుండా ప్రతి బూత్ స్థాయిలో పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. SIR ప్రక్రియలో గ్రామాల సర్పంచ్లు,మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. మీ అందరూ ఓటు వేస్తేనే నేను ఎమ్మెల్యేగా గెలిచానని,రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఓటు హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని మంత్రి అన్నారు. *పార్టీ నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉండాలి* SIRపై పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, వాటిని ప్రతి కార్యకర్త వందకు వంద శాతం ఖచ్చితంగా పాటించాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. పార్టీ ఉంటేనే మనం ఉన్నామని, మక్తల్ లో పార్టీని కష్టకాలంలో కాపాడింది నియోజకవర్గ కార్యకర్తలే అని స్పష్టం చేశారు. *పేదల ఓట్లు పోకుండా చూడటమే ప్రధాన లక్ష్యం* ప్రస్తుతం పార్టీ ముందున్న ప్రధాన అంశం బీద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ప్రజల ఓట్లు తొలగిపోకుండా చూడటమేనని మంత్రి స్పష్టం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు పనిచేసే వ్యక్తే నిజమైన కార్యకర్త అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందాలంటే ప్రజా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రి తో పాటు మక్తల్ నియోజకవర్గ అబ్సర్వర్ గుత్తా అమిత్ రెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ రేవతి గౌడ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, 7 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, BLAలు, సూపర్వైజర్లు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








