మంచేరియల్, 8 September
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
*కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలి.* *-బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.* మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి,రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన 6 గ్యారంటీలను మరియు 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.












