Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 12
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పిల్లల కోసం ఉచిత పిల్లల మరియు చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఈడీ ఎస్టీపీపీ శ్రీ సిహెచ్. చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పిల్లల కోసం ఉచిత పిల్లల మరియు చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈడీ ఎస్టీపీపీ శ్రీ సిహెచ్. చిరంజీవి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, థర్మల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ వైద్య శిబిరంలో అవని హాస్పిటల్, మంచిర్యాలకు చెందిన పిల్లల వైద్య నిపుణులు డా. రఘువంశీ, చర్మ వ్యాధుల నిపుణురాలు డా. రోజిత వైద్య సేవలు అందించారు. శిబిరంలో 50 మంది పిల్లలు, 70 మంది చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య సహాయం పొందారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీపీ జిఎం శ్రీ ఎం. నరసింహారావు, డిస్పెన్సరీ డాక్టర్ జానకి, రిటైర్డ్ డాక్టర్ ప్రభాకర్ తో పాటు ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.











