మంచేరియల్, 2026-07-12
దివంగత కందుల రాజన్న గారి తృతీయ వర్ధంతి సందర్భంగా కుక్కలగూడూరులో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్, ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ముఖ్య అతిథిగా బీజేపీ OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.
కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్, ఆలయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత కందుల రాజన్న గారి తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
కందుల రాజన్న గారి కుమారుడు శ్రీ కందుల సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి కందుల సంధ్యారాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీమతి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, దివంగత కందుల రాజన్న గారు సమాజ సేవనే జీవిత ధ్యేయంగా భావించి ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి కుమారుడు శ్రీ కందుల సాగర్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
శిబిరంలో నిపుణులైన వైద్యులు వందలాది మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు, శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించి తదుపరి చికిత్సకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ సర్పంచ్ మేడం బాపన్న- దేవక్క, వెంనూర్ ఉపసర్పంచ్ పొన్నం సంతోష్ గౌడ్, పుట్నూరు సర్పంచ్ తోట ప్రశాంత్, ఆలయ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈఓ రమేష్ బాబు, డిప్యూటీ సీఈవో నాగార్జున, ఆలయ ఫౌండేషన్ ఇంచార్జ్ పరికిపండ్ల రామ్, గోపు రామన్న, కొలిపాక శంకరయ్య, ఏరుకొండ తిరుపతి మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











