మంచేరియల్, 2026-07-20
మంచిర్యాలలో సేవాభారతి ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్-ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31లోపు తమ అడ్మిషన్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగ లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సేవాభారతి- మంచిర్యాల ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్-ఇన్స్పెక్టర్ (SI) పరీక్షలకు ప్రత్యేక ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభమవుతున్నాయి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా జూలై 31వ తేదీలోపు అడ్మిషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం https://docs.google.com/forms/d/e/1FAIpQLSc9BFD3O3cnNDz-DVRxDeQ6IrcCB0jh7snSNeSh7RLwG6AQDw/viewform?usp=header లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లింక్ ద్వారా నమోదు చేసుకున్న వారికి కోచింగ్ సెంటర్ లొకేషన్, పూర్తి అడ్రస్, కోచింగ్‌లో పాటించవలసిన నియమాల వంటి వివరాలను ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన మార్గదర్శకత్వంతో విజయానికి తొలి అడుగు వేయాలని సేవాభారతి కోరింది. మరిన్ని వివరాల కోసం 9948525970, 9390811552 నంబర్లను సంప్రదించవచ్చు.












