మంచేరియల్, 2026-07-16
శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి అధికారిపై బాధ్యత మరింత పెరుగుతుందని, అప్పగించిన విధులను నిజాయితీ, నిబద్ధతతో నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ముగ్గురు అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి పోలీసు అధికారిపై బాధ్యత మరింత పెరుగుతుందని, అప్పగించిన విధులను సమర్థవంతంగా, నిజాయితీతో, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఎ.సత్తయ్య, పి.వెంకన్న గౌడ్, ఎం.ఎ.హబీబ్ గురువారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పదోన్నతి పొందడం ప్రతి ఉద్యోగికి గర్వకారణమని, అయితే దానితో పాటు బాధ్యత కూడా మరింత పెరుగుతుందని అన్నారు. విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.










