మంచిర్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
స్థానిక ఆండాలమ్మ కాలనీ డంప్ యార్డు వద్ద నూతనంగా నిర్మించిన abc కేంద్రాన్ని మేయర్ శ్రీ దర్ని మధుకర్ పరిశీలించారు. ఆయనతో డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ గారు కూడా ఉన్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్లు abc కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు. అక్కడ కుక్కలకు అందించే వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సల వివరాలను వైద్యాధికారులతో చర్చించారు.
ఈ కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీధి కుక్కలకు క్రమబద్ధంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది, అని వైద్యాధికారులు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజల భద్రత మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడినట్లు చెప్పారు.











