డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్మి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు.
అందరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.







