మంచేరియల్, 2026-07-25
లక్షెట్టిపేట్ SPR ఫంక్షన్ హాల్ లో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. నూతన పాలకవర్గాన్ని అభినందించి, శాలువాలతో సన్మానించారు.
లక్షెట్టిపేట్ SPR ఫంక్షన్ హాల్ లో నూతన లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా చాతరాజు రాజేష్, డైరెక్టర్లు సభ్యులందరినీ అభినందించి, శాలువాలతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ ఛైర్మన్ దొంతన అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, లక్షెట్టిపేట్ మండల అధ్యక్షులు నలిమెల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పూర్ణచంద్రరావు, ఆరిఫ్, పిగిలి రమేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, దండేపల్లి మాజీ ఎంపీపీ అక్కల శకుంతల, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









