మంచేరియల్, 14 September
తెలంగాణ రక్షణ సేన () జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారిని నియమిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం ప్రకటించిన వివిధ జిల్లాల అధ్యక్షుల జాబితాలో జిల్లా బాధ్యతలను చంద్రమోహన్ గౌడ్‌కు అప్పగించారు.
తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షునిగా డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్ నియామకం కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రమోహన్ గౌడ్ ఉదారి తెలంగాణ రక్షణ సేన (TRS) జిల్లా అధ్యక్షునిగా విద్యావంతుడు , సామాజిక సేవ కార్యకర్త అయినటువంటి డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి ని నియమిస్తూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు సోమవారం వివిధ జిల్లా ల అధ్యక్షులను ప్రకటించిన నేపద్యం లో చంద్రమోహన్ గౌడ్ కి జిల్లా బాధ్యతలను అప్పగించారు తనపైన నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షులు గా అవకాశం కల్పించిన కవితక్క గారికి చంద్రమోహన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు . చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ కవితక్క గారు ప్రవేశ పెట్టిన పాంచజన్య సిద్ధాంతలను ప్రజలకు విస్తృతంగా వివరించి , విద్య , ఉపాధి , వైద్యం , వ్యవసాయం , సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు తెలంగాణ రక్షణ సేన కట్టుబడి ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.












