Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 24
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా భీమారం మండల BRS పార్టీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, రోగులకు పండ్ల పంపిణీ, బస్టాండ్‌లో కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా భీమారం మండల BRS పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండ రామాలయం ఆలయంలో అయ్యవార్లతో పూజ, అభిషేకం, అర్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
భీమారం మండలంలో సుమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు BRS నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం, భీమారం మండల BRS కార్యకర్తల ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కట్ చేసిన కేక్‌ను, స్వీట్లను ప్రయాణికులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.











