శ్రీరాంపూర్ సింగరేణి -3 మైన్ వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్మికులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు.
శ్రీరాంపూర్ సింగరేణి -3 మైన్ వద్ద ఉన్న దుర్గామాత ఆలయంలో అమ్మవారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శించుకొని, ఆలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. నిత్యం భూగర్భ బొగ్గు గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థించారు. కార్మికులందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులతో పాటు సత్రం రమేష్, కర్రె చక్రవర్తి, కాదాసు భీమయ్య, పొన్నవేణి సదయ్య, కంపెల్లి తిరుపతి, కొండ వెంకటేష్, శేఖర్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












