జిల్లాలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నెన్నల్ మండలంలోని కన్నెపల్లి యూనిట్ పరిధిలో రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సుమారు 60 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో సభ్యత్వం స్వీకరించారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీహరి ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని ప్రతి యూనిట్లో సభ్యత్వ నమోదును వేగంగా పూర్తి చేయాలని, రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులందరూ సంఘటితంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, కన్నెపల్లి యూనిట్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, బెల్లంపల్లి యూనిట్ కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. సభ్యులు ఇజాజ్, చందు, శ్రీనివాస్, సులోచనతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకున్నారు.












