మంచేరియల్, 26 September
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతిని శనివారం మంచిర్యాల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ రోడ్ లోగల రజక సంఘం కమ్యూనిటీ భవనంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతిని శనివారం మంచిర్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బైపాస్ రోడ్ లోగల రజక సంఘం కమ్యూనిటీ భవనంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, పోశం మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మను కొనియాడారు. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, పట్టణంలోని ఏదో ఒక కూడలిలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోశం, కోశాధికారి నస్పూరి పోశం, ఉపాధ్యక్షులు పోచంపెల్లి ధర్మయ్య, పున్నం సమ్మయ్య, ముఖ్య సలహాదారు నేరెళ్ల రమేష్, నాయకులు జంగపెల్లి సతీష్, తోటపెల్లి రాజేశం, సోమరాపు రమేష్, పున్నం మధు, సదానందం, మురుకుంట్ల పోశం తదితరులు పాల్గొన్నారు.










