మంచేరియల్, July 4, 2026
ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
అంతకుముందు నస్పూర్ మండల కేంద్రంలో గల ఈ.వి.ఎం. గోదాము వద్ద భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి. పాట్ల భద్రతకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.