సారాంశం
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి వద్ద గల అభ్యాస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్యమహేష్ పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1ఈ వేడుకల్లో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్యమహేష్ పాల్గొన్నారు.
- 2ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ, సల్ల రమ్యలు స్వయంగా బతుకమ్మను పేర్చి, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
- 3తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కొక్కిరాల సురేఖ తెలిపారు.
- 4బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులతో కలిసి పాల్గొన్న కొక్కిరాల సురేఖ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి వద్ద గల అభ్యాస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి వద్ద గల అభ్యాస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్యమహేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ, సల్ల రమ్యలు స్వయంగా బతుకమ్మను పేర్చి, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కొక్కిరాల సురేఖ తెలిపారు.
కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముందుగానే సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో తెలంగాణ సంస్కృతిపై అవగాహన పెంచేలా నిర్వహించబడింది.