మంచేరియల్, 24-07-2026
మంచిర్యాల హమాలివాడలోని శ్రీశ్రీశ్రీ కట్ట పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా జరగనుంది. జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటలకు అమ్మవారికి బోనం సమర్పణతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ జోగిని నిషా క్రాంతి, పోతరాజుల నృత్యాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
మంచిర్యాల హమాలివాడలోని శ్రీశ్రీశ్రీ కట్ట పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగనుంది. జూలై 26, ఆదివారం ఉదయం 10 గంటలకు కట్ట పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఈ వేడుకలకు ప్రముఖ జోగిని నిషా క్రాంతి గారు హాజరై, తాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజుల నృత్యాలతో కన్నుల పండువగా జాతరను ప్రారంభిస్తారు.
ఈ జాతరను 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నల్ల శంకర్ గారు, నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.
గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారు.
మేయర్ శ్రీ ధరిని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ గారు.
ఈ బోనాల జాతరను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ, నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇట్లు, శ్రీశ్రీశ్రీ కట్ట పోచమ్మ దేవాలయం కమిటీ, నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్.












